AG 201 నిండు మనస్సుతో నిన్నే
                
                
                
                
                 
                
                
                
                    
                        
                            
                                Versi
                                Version
                                1
                            
                        
                        
                            
                                
                                    
                                        నిండు మనస్సుతో నిన్నే
                                    
                                        కొలిచేను దేవా
                                    
                                        రెండు కనులలో నిన్నే
                                    
                                        నిలుపుకొంటినయ్యా
                                    
                                        పండు వెన్నెలే మాకు
                                    
                                        నీ కరుణ కాంతి
                                    
                                
                                
                             
                        
                            
                                
                                    1
                                    
                                        
                                        పరిపక్వమైన మా
                                        
                                        పాపాలనెల్లబాపి
                                        
                                        గురిలేని మా బ్రతుకున
                                        
                                        వెలుగుబాట జూపి
                                        
                                        పరిశుద్ధమైన నీ మోక్ష
                                        
                                        మార్గమందు నడిపి
                                        
                                        దరి జేర్చి సంరక్షించు
                                        
                                        మా పాలిదైవమా           ||నిండు||
                                        
                                     
                                
                                
                             
                        
                            
                                
                                    2
                                    
                                        
                                        నీ నీతి వాక్యములనే
                                        
                                        పాటింతుమయ్యా
                                        
                                        నీ అడుగుజాడలలో
                                        
                                        పయనింతుమయ్యా
                                        
                                        నీ ఘనతనే జగతిని
                                        
                                        కీర్తింతుమయ్యా
                                        
                                        నీ చరణ దాసులమయ్యా
                                        
                                        పాలించరావయ్య  	   ||నిండు||
                                        
                                     
                                
                                
                             
                        
                     
                
                
                
             
         
        
            
            
            
            OK
            
            Terima kasih untuk bantuannya. Link sudah kami terima. Kami akan memprosesnya terlebih dahulu.
            
         
     
 
    
    
    
    
      © 2010–2025 Tim Alkitab
      © 2010–2025 Quick Bible Team
    
    
    